తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో ఏడు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి నెల వరకు పదవీ కాలం పొడిగించింది. ఈ నెల 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసు పొడిగించాలని డివోపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో 7 నెలలు సర్వీసు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఏఐఎస్ (సీఎస్–ఆర్‌ఎం) రూల్స్–1960లోని రూల్–3ని ప్రయోగించడం ద్వారా ఏఐఎస్ (డీసీఆర్బీ) రూల్స్‌లోని 16(1) నిబంధనను సడలిస్తూ రామకృష్ణారావు సర్వీసును పొడిగించినట్టు కేంద్రం తెలిపింది. 1991 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావు గత ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.