దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదు
తెలంగాణ జాగృతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే.. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతికి ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు ఒకరు కేసీఆర్ మరొకరు ప్రొఫెసర్ జయశంకర్ అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తెలంగాణలో ఉన్న యువతి యువకులు దేశం గురించి ఆలోచించాలని, దేశంలో మేధావులు మాట్లాడడం మానేశారన్నారు. రచయితలు ఎందుకోసం రాయాలి ? ఎవరి కోసం రాయాలని ఆలోచన చేసే పరిస్థితి వచ్చిందని ఆమె అన్నారు. దేశంలో మేధావి వర్గం అసంతృప్తితో ఉందని, దేశవ్యాప్తంగా జాగృతి సంస్థ అన్ని రాష్ట్రాల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్కార్లను బిజెపి సర్కార్ కూల్చివేస్తే… దీని గురించి జాతిని మనం జాగృతి చేయకూడదా..? అని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను మనం కాపాడితే… అవి మనల్ని కాపాడుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని రాజ్యసభ వేదికగా వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని.. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. మరోవైపు పోలవరంపైనా కేంద్ర ప్రభుత్వం ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏపీలో పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్
కడప స్టీల్‌ప్లాంట్ కోసం రూ.23,985 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ మేరకు కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ అమోదముద్ర వేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు కూడా ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. దీంతో వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుతో వెనుకబడ్డ రాయలసీమ ముఖచిత్రం మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ధాన్యం సేకరణలో కేసీఆర్ చేస్తున్నది కేవలం బ్రోకరిజమే
ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు జగిత్యాలలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. అయితే.. ఈ సందర్భంగా బండి సంజయ్.. జగిత్యాల బస్ స్టాండ్ చౌరస్తాలో బిజెపి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో సమైక్యాంధ్ర నాయకులతో కుమ్మక్కై, కేసీఆర్ రాజకీయాలు చేస్తుండని ఆయన ఆరోపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కలిసి… కాంట్రాక్టులు చేస్తూ… కమిషన్లు దొబ్బుతూ… రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సెంటిమెంటు రగిలించి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలను కేసీఆర్ సర్వనాశనం చేసిండన్నారు. పుట్టబోయే బిడ్డ నెత్తి పైన లక్ష రూపాయల అప్పు పెట్టిండని, కరెంటు చార్జీలను పెంచిండన్నారు. ఈ జగిత్యాల జిల్లాలో పేదలకు ఇండ్లు కట్టడానికి పైసలు లేవంట కానీ, కేసీఆర్ బిడ్డ లక్ష కోట్లు పెట్టి ఢిల్లీ లక్కర్ దందా చేయడానికి మాత్రం పైసలు ఉన్నాయట అని ఆయన విమర్శించారు.
రూ.2000 నోట్లకు రెండేళ్ల గడువు.. రద్దు చేయండి
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎప్పుడు ఏ నోట్లను రద్దు చేస్తారు? అనే టెన్షన్ కొనసాగుతూనే ఉంది.. కొన్ని నోట్ల ముద్రణ ఆగిపోయినా..? మార్కెట్‌లో కనిపించకపోయినా? ఏమైంది? ఏదో జరగబోతోంది? అవి కూడా రద్దు చేస్తారా? అనే ప్రచారం సాగుతూ వస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కీలక వ్యాఖ్య లు చేశారు. రాజ్యసభలో ఇవాళ మోడీ మాట్లాడుతూ.. రూ.2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. ఈ పెద్ద నోట్లు ఉన్నవారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని కూడా ఆయన సూచించారు.. ఇప్పటికే ఏటీఎంల నుంచి రూ.2వేల నోట్లు రావడం లేదని.. త్వ రలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పుకొచ్చారు.. ఇక, కేంద్ర ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు సుశీల్ కుమార్ మోడీ.
కిడ్నీకి రూ.7 కోట్ల ఆఫర్.. విద్యార్థిని నుంచి లక్షలు దోచేశారు
ఈజీ మనీ కోసం కొందరు షాట్‌కట్స్ వెతుకుతుంటారు. త్వరగా డబ్బులు సంపాదించాలి.. లక్షాధికారిని అయిపోవాలి.. కోటీశ్వరుడిగా పేరు తెచ్చుకోవాలి.. ఇలా ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు.. అయితే, వీరికంటే అడ్వాన్స్‌డ్‌గా సైబర్ నేరగాళ్లు ఉన్నారనే విషయాన్ని మర్చిపోతారు.. ఈజీగా వారి వలలో చిక్కుకుని ఉన్నకాడికి సమర్పించుకుంటారు.. తాజాగా, గుంటూరు జిల్లాలో కిడ్నీకి రూ.7 కోట్ల ఆఫర్ కలకలం సృష్టించింది.. ఆన్‌లైన్‌లో ఉన్న సమయంలో.. కిడ్నీ అమ్మితే భారీగా డబ్బులు వస్తాయనే ఓ లింక్ చూసిన ఇంటర్ విద్యార్థిని.. ఆ లింక్ క్లిక్ చేసి తన వివరాలు పొందుపర్చింది. .ఇక, కిడ్నీ అమ్మితే రూ. 7 కోట్లు ఇస్తామని సైబర్ నేరగాళ్లు ఆ యువతికి ఆఫర్ ఇచ్చారు. అలా సైబర్ నేరగాళ్లు.. ఆ విద్యార్థితో పరిచయం చేసుకున్నారు. ఫేక్ అకౌంట్ చూపి మూడు కోట్ల రూపాయాలు బాధిత యువతి ఖాతాలో జమ చేసినట్లు చూపించారు.
పవిత్ర- నరేష్ కేసులో కొత్త ట్విస్ట్.. వారికి దబిడిదిబిడే
టాలీవుడ్ జంట పవిత్ర లోకేష్- నరేష్ కేసులో కీలక మలుపు చోటుచేసుకొంది. తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి, తమ పరువుకు భాగం కలిగిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీనిపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఇక ఆ తరువాత ఆ యూట్యూబ్ ఛానెల్స్ కు డబ్బు ఇచ్చి తమ పరువు తీయడానికి ప్రయత్నించింది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అని మరోసారి పోలీసులను ఆశ్రయించింది పవిత్ర. తాజాగా వీరిపై నాంపల్లి కోర్టు ను ఆశ్రయించిన నరేష్ జంట. తమ పరువు తీయడానికి ప్రయత్నించిన యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. వారి కేసును విచారించిన కోర్టు 12 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్లపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆ ఛానెల్స్ ఏంటంటే.. ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్ప్రెషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ లకు నోటిసులు ఇచ్చి విచారణ జరపాలని నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.