బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ వాళ్లను చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని విమర్శించారు. మెకానికల్ లైఫ్ కాదు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మానవ సంబంధాలే ఉండాలని తాము చూస్తున్నామన్నారు. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్…
KTR has no Political Maturity Said Jagga Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీపై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా? అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిశారు కదా?,…
High Court refuses to issue interim orders for KCR: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్‌ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్, హరీష్‌రావు…
Aarogyasri Services To Stop From August 31: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ‘ఆరోగ్యశ్రీ’ సేవలు అతి త్వరలో నిలిచిపోనున్నాయి. ఆగస్ట్ 31 అర్థరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్రశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్హెచ్ఏ) ఓ ప్రకటన చేసింది. బకాయిల చెల్లింపులో జాప్యం, ఆర్థిక భారం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఏఎన్హెచ్ఏ తెలిపింది. గురువారం ఆరోగ్యశ్రీ…
Marri Janardhan Reddy Warns Telangana Police: తెలంగాణ పోలీసులపై నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి బానిస అయ్యారని విమర్శించారు. సీఎం గురించి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా.. ఉదయనే వారి ఇంటి ముందు పోలీసులు ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కందనూలు ప్రాంతంలో పనిచేసిన ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీల పేరు రాసి పెట్టుకుంటాము అని హెచ్చరించారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే…
Godavari Water Level at 49 Feet at Bhadrachalam: భద్రాచలం గోదావరి నీటిమట్టం తగ్గుదల ప్రారంభమైంది. గురువారం రాత్రి నుంచి స్వల్పంగా గోదావరి తగ్గుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 49 అడుగులకు చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారన్న విషయం తెలిసిందే. గోదావరి నీటిమట్టం పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు స్తంభించాయి.…
OU JAC Calls Telangana Bandh Today Due To Go Back Marwadi Protest: నేడు (ఆగస్టు 22) తెలంగాణ బంద్‌కు ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణలోని స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓయూ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు ఇప్పటికే కొన్ని వర్తక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. అలానే తెలంగాణలోని కొన్ని జిల్లాలు బంద్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…
జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ... కోరుట్లలో అయితే టైట్ ఫైట్ ఇచ్చి కాంగ్రెస్‌ని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక జగిత్యాలలో పోటీ చేసిన భోగా శ్రావణి 43 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇక్కడ మూడో స్థానంలో నిలిచినప్పటికి... కొన్ని గ్రామాలు, జగిత్యాల పట్టణంలో ఆధిక్యత ప్రదర్శించడం కేడర్‌లో జోష్ నింపింది.
ఎమ్మెల్యే వినోద్ దృష్టికి కూడా వెళ్ళి ఆయన క్లాస్ పీకడంతో.... అది పాత వీడియో సార్... ఇప్పుడెవరో బయటపెట్టారంటూ కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదట. అది పాతదా ..కొత్తదా అన్న సంగతి పక్కన పెడితే.... నడిరోడ్డు మీద తాగి తందనాలాడటం ఇప్పుడు బెల్లంపల్లిలో హాట్‌టాపిక్ అయింది. ఎమ్మెల్యే వినోద్‌కు వివాద రహితుడని పేరుంది. కానీ ఆయన వ్యక్తిగత సిబ్బంది తీరు మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. పీఏల విషయంలో గతంలో మావోయిస్టులు సైతం సికాస…