తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్లోని ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలుపుతూ ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి కూడా బీహార్లో చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివి.. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది.. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులే.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి ఈ యూనివర్సిటీ విద్యార్థినే.. తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఓయూలో 80 కోట్ల వ్యయంతో నిర్మాణమై 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టల్స్ ను ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమం శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం దాదాపు 10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులకు కూడా ప్రారంభించనున్నారు. Also Read:Agent…
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆడుకుంటూ వెళ్లి వ్యవసాయబావిలో పడిపోయాడు 18 నెలల బాలుడు. కౌశిక్ నందు అనే బాలుడు బావిలో పడి మృతిచెందాడు. బాలుడిని వ్యవసాయ బావి వద్ద కూర్చోబెట్టి తల్లి పొలానికి నీళ్లు పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి కళ్ళముందే బాలుడు మృతి చెందడంతో గుండెలవిసేలా రోదించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో…
CM Revanth Reddy : హైదరాబాద్లో జరిగిన బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రసంగం చేశారు. జీవవిజ్ఞానం, వైద్య రంగం, ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి ఆయన విశ్లేషిస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. “దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు. మనం మంచి విద్యార్థులమా కాదా అనేది ప్రశ్న,” అని సీఎం రేవంత్ అన్నారు. జీవశాస్త్రం, వైద్య రంగంలో ప్రకృతినే మనకు…
పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో బై ఎలక్షన్ తప్పక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 3 నెలలు లేకుంటే.. 6 నెలల సమయంలో ఎన్నికలు వస్తాయన్నారు. దమ్ముంటే పార్టీ మారిన నియోజకవర్గాల్లో రాజీనామా చేసి రండి ఎన్నికలకు రండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలకు వెళితే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుందన్నారు. బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కు బై బై చెప్పే…