ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్ కళ్యాణ్: ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ-జనసేన మరింత వేగం పెంచుతోంది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండుసార్లు భేటీ కాగా.. నేడు అమరావతిలో మరోసారి సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఇద్దరు నేతలు కీలక చర్చలు…
తిరుమలలో నేడు రెండో రోజు ధార్మిక సదస్సును నిర్వహిస్తారు. ఈ సదస్సుకు 32 మంది స్వామీజీలు హాజరుకానున్నారు. సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. పీఠాధిపతులు, మాఠాథిపతుల సూచనలు, సలహాలను తీసుకొని హిందూ ధర్మప్రచారం చేయనున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. దీని ద్వారా శ్రీవారి వైభవాన్ని, హైందవ సంస్కృతిని వ్యాప్తి చేసేందుకు తిరుమల ఓ మంచి వేదిక కాబోతుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు టీడీపీ వేద సదస్సును…
Temperatures increasing in Telangana: మొన్నటివరకు వణికించిన చలి.. ఇటీవలి రోజుల్లో తగ్గుముఖం పట్టింది. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా దాదాపుగా అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. 5 రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా.. 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. మరోవైపు హైదరాబాద్‌లో 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్, మెదక్, భద్రాచలం, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ ఎండ…
Big Breking: బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు. ఈ నెల 10న కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.