ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో వేగాన్ని పెంచారు. మరో వైపు తల్లి గెలుపును కాంక్షిస్తూ ఆమె కూతురు మనీషా రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన సుమారు వంద మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే క్వింటాలుకు మద్ధతు ధర రూ. 3180 చెల్లించి రైతుల వద్ద నుండి జొన్న కొనుగోలు చేస్తోంది. అయితే గత ఐదు సంవత్సరాల దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితిని విధించి కొనుగోలు చేస్తున్న సందర్భములో.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ యాసంగిలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, ఆ మేరకు ఎకరానికి ఇంతకుముందు ఉన్న పరిమితిని పెంచాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తులు వచ్చాయి.
ప్రస్తుత వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ మరియు వినియోగాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రతి విద్యుత్ శాఖ ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో.. చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రేటర్…
కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీ. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు.. నిన్న పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇస్తూ.. రోహిత్ దళితుడే కాదని చెబుతోందని పేర్కొన్నారు. మనకులాల గురించి మనమే ఆలోచన చేయాలన్నారు.