హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అతివేగంతో పోలీస్ బూత్ దిమ్మెల్ని ఢీకొట్టాడు. అనంతరం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు టైర్, ఆయిల్ ట్యాంక్ పగిలిపోయింది. ప్రమాదం జరగగానే కారులోని బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ కారు దిగి పరారైపోయాడు.
ఇది కూడా చదవండి: KA 10 : దిల్ రూబా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. కారు మాలిక్ జెమ్స్ అండ్ జువెలరీ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లుగా గుర్తించారు. కారుపై రెండు చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిల్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణనష్టం తప్పింది.