Home
Telangana
Telangana News
-
కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి.. బీజేపీ నేత ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ కామెంట్ చేశారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. టీఆర్ఎస్ నుంచి వలసలపై స్పందించిన ఆయన.. ఆలే నరేంద్రను వెళ్లకొట్టారు, విజయ శాంతి, స్వామి గౌడ్ వంటి ఎంతో మందిని బయటకు పంపించారు.. ఇప్పుడు ఈటల వంతు వచ్చిందన్నారు.. మధుసూదనాచారిని కేసీఆరే ఓడగొట్టారంటూ విమర్శించిన ఆయన.. ఇక, మిగిలింది హరీష్ రావే!.. హరిష్ రావుకు కూడా అనేక అవమానాలు జరిగాయని చెప్పుకొచ్చారు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు… -
పంజాబ్, ఏపీలను తలదన్నే విధంగా తెలంగాణలో ధాన్యం పండింది…
సిద్దిపేట జిల్లా… నంగునూర్ మండలం మగ్దుంపూర్ లో ఆయిల్ ఫామ్ సాగు ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఈ సందర్బంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల జీవితాలు బాగు పడతాయని చెప్పిన మాట నిజమైంది. కాళేశ్వరం జలాలతో తెలంగాణలోని భూ ఉపరితల సాగునీటి పరిమితి పెరిగింది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్నే విధంగా తెలంగాణలో ధాన్యం పండింది అన్నారు. ప్రతి ఏటా మన దేశంలో 90 వేల కోట్ల పామాయిల్ ను విదేశాల నుంచి… -
హైదరాబాద్: నాలాలో పడి ఏడేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్‌లో ఓ బాలుడు నాలాలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది.. దీంతో బోయిన్‌పల్లిలో విషాదం నెలకొంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ప్రమాదవశాత్తు చిన్నతోకట్ట నాలాలో పడిపోయాడే ఏడేళ్ల బాలుడు ఆనందసాయి.. నాలా నిర్మాణంలో ఉండగా.. ఇంటిముందు ఆడుకుంటుండగా అందులో పడిపోయాడు… విషయం తెలుకున్న స్థానికులు.. అధికారులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టినా.. ఆ బాలుడు ప్రాణాలు దక్కలేదు.. నాలాలో పడిపోయిన ఆ బాలుడు మృతదేహంగా… -
ఈటల పచ్చి అవకాశవాది.. మతోన్మాద పార్టీలో చేరుతూ మాపై నిందలా..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీపీఐ నేత చాడా వెంకట్‌రెడ్డి.. టీఆర్ఎస్కు రాజీనామా సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. ఈటల పచ్చి అవకాశవాదని వ్యాఖ్యానించిన చాడా… మతోన్మాద పార్టీ (బీజేపీ)లో చేరుతూ సీబీఐ మీద నిందలు వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తే మా పార్టీ కార్యాలయాన్నే ధర్నా చౌక్‌గా మార్చిన చరిత్ర సీపీఐది అన్న ఆయన.. అసైన్ భూములు… -
ఈ నెల 10న ఉమ్మడి నిజామాబాద్‌లో కేసీఆర్ పర్యటన
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ నెల 10వ తేదీన కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, పోలీస్ కార్యాలను ప్రారంభించనున్నారు.. ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని భవనాలను సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.. కామారెడ్డి పట్టణ శివారులోని నూతన కలెక్టరేట్, పోలీసు భవనాల నిర్మాణ పనులను 2017లో అప్పటి రెవెన్యూశాఖ మంత్రి మహ్మద్‌అలీ ప్రారంభించగా.. సుమారు 30 ఎకరాలలో రూ.66 కోట్ల నిధులతో… -
వ్యాక్సినేషన్లో కేంద్రం ఫెయిల్.. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులు..!
వ్యాక్సినేషన్ విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో హై రిస్క్ పర్సన్స్ కి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనేరీతిలో కేంద్రం వ్యవహారం ఉందన్న ఆయన.. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని.. మరోవైపు… -
ఈటల అప్డేట్: రాజీనామాకి మంచి రోజు కాదట!
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఉద్యమ నేత నుంచి టీఆర్ఎస్లో కీలకనేత స్థాయికి ఎదిగిన ఈటల రాజేందర్ ఎట్టకేలకు 19 ఏళ్ల అనుబంధం తరువాత టీఆర్ఎస్తో బంధానికి స్వస్తి పలికారు. కాగా నేడు ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించే అవకాశం ఉండగా.. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మంచి రోజు కోసం చూస్తున్న ఈటలకు… -
నేడు స్పీకర్ కు ఈటల రాజీనామా లేఖ
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు రాజేందర్ స్పీకర్‌కు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా లేఖను పంపనున్నారు. టీఆర్ఎస్ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు రాజేందర్ ప్రకటించారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని… బానిసగా బతకలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్…. ఇప్పుడు… -
నేటి నుంచి ఉచిత బియ్యం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విపత్తు ప్యాకేజీ కింద నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇచ్చే ఉచిత బియ్యంతో పాటు తెలంగాణ కోటా కింద కూడా ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది. తెలుపు రేషన్ కార్డు ఉన్న ఒక్కో వినియోగదారునికి 15 కిలోల చొప్పున పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 15… -
ఈటల వ్యవహారం.. స్పందించేందుకు కేటీఆర్ నిరాకరణ
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సంచలనమే సృష్టించింది.. ఈ వ్యవహారంపై పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు స్పందించారు.. ఈటల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. అయితే, ఈటల రాజేందర్ ఎపిసోడ్‌పై స్పందించేందుకు నిరాకరించారు మంత్రి కేటీఆర్… ఇవాళ గచ్చిబౌలి టిమ్స్‌ను సందర్శించిన ఆయన.. 150 ఐసీయూ బెడ్స్‌ను ప్రారంభించారు. అనంతరం కరోనా వార్డులను కలియతిరుగుతూ.. కరోనా బాధితులను పరామర్శించి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అందుతోన్న వైద్య సేవలను…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!