* నేడు ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మూడో టెస్ట్ మ్యాచ్.. లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానున్న టెస్ట్ మ్యాచ్
* నేడు ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్స్.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కార్యక్రమం.. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం.. పాఠశాల విద్యలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల సహకారంపై చర్చ.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్.. డ్రగ్ ఎడిక్షన్ తదితర అంశాలపై అవగాహణ కార్యక్రమం
* గిన్నిస్ బుక్ రికార్డు దిశగా పేరెంట్ టీచర్ మీటింగ్.. 2 కోట్లకు పైగా భాగస్వామ్యంతో పేరెంట్ టీచర్ మీటింగ్.. 74 లక్షలకు పైగా విద్యార్థులు పాల్గొంటారని అంచనా
* నేడు సత్యసాయి జిల్లాలో సీఎ చంద్రబాబు పర్యటన.. కొత్తచెరువు స్కూల్‌లో పేరెంట్ టీచర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం.. మధ్యాహ్నం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహా సమాధి దర్శనం
* పుట్టపర్తిలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్.. నేడు ప్రశాంతి నిలయం గురుపూర్ణిమ వేడుకల్లో పాల్గొననున్న కేంద్రమంత్రి
* హైదరాబాద్: నేడు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి కేసీఆర్.. హెల్త్ చెకప్ కోసం మరోసారి ఆస్పత్రికి వెళ్తున్న మాజీ సీఎం
* నేడు పోలవరం నిర్వాసిత గ్రామాల్లో సీపీఎం రాష్ట్ర బృందం పర్యటన.. పోలవరం పనులు, పునరావాహసం, నిర్వాసితుల పరిస్థితి పరిశీలన
* విజయవాడ: నేటితో ముగియనున్న శాకంబరీ దేవి ఉత్సవాలు..
* ఈ రోజు ఉదయం 11 గంటలకు పీసీ ఘోష్ కమిషన్ ను కలువనున్న మాజీ మంత్రి హరీష్‌రావు.. మరింత అదనపు సమాచారం అందించేందుకు సమయాన్ని కోరిన హరీష్.. ఉదయం 11 గంటలకు బీఆర్‌కే భవన్ లో కలవడానికి సమయం ఇచ్చిన కమిషన్
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటన.. జాగృతిలో పలువురి చేరిక, పరామర్శలు చేయనున్న కవిత
* నెల్లూరు : ఉలవపాడు మండలం కరేడులో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ పర్యటన.. కరేడు గ్రామ రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్న రామకృష్ణ..
* విశాఖ: ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అపన్నకు తుది విడత చందన సమర్పణ.. గిరిప్రదక్షణ ముగించుకుని స్వామి వారి దర్శనం కోసం భారీగా కొండకి చేరుకుంటున్న భక్తులు… ఈ ఒక్కరోజే 60 వేల మందికి పైగా వస్తారని అంచనా…
* తిరుమల: ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి..
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబైన ప్రశాంతి మందిరం. వేడుకల్లో పాల్గొననున్న కేంద్ర వ్యవసాయ , గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్.. గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి లోకేష్.. ప్రముఖుల రాకను దృష్టిలో పెట్టుకుని భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు.
* శ్రీ సత్యసాయి : పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువులో పర్యటించనున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,మంత్రి నారా లోకేష్.. కొత్తచెరువులో జరిగే పేరెంట్స్ అండ్ టీచర్ మీట్లో పాల్గొనడానికీ పుట్టపర్తి చేరుకున్న మంత్రి నారా లోకేష్.
* విజయనగరం: నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్, టీచర్స్ సమావేశాలు.. దత్తిరాజేరు మండలం మరడాం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గోనున్న రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ ..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్.. ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలో ఈ సమావేశం నిర్వహణ.. పాఠశాలల్లో కల్పించవలసిన మౌలిక వసతులపై చర్చ
* తూర్పు గోదావరి జిల్లాలో నేడు మంత్రి కందుల దుర్గేష్ పర్యటన వివరాలు.. ఉదయం 09:00 గంటలకు ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు “మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్” కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం11:30 గంటలకు నిడదవోలు పట్టణంలో జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నందు “మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్” కార్యక్రమంలో పాల్గొంటారు.
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో గురు పౌర్ణమి సందర్భంగా నేడు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ అధ్వర్యంలో నేడు తుంగభద్ర తీరంలో తులసి వనంలో తులసి పూజ, లక్ష్మి పూజ, మృతిక సంగ్రహనోత్సవం.
* నంద్యాల: మహానంది క్షేత్రంలో ఆషాడ మాస వేడుకల్లో భాగంగా నేడు శాకాంబరీ అలంకరణలో దర్శనం ఇవ్వనున్న కామేశ్వరిదేవి అమ్మవారు
* నెల్లూరు: సిటీ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టానున్న మంత్రి నారాయణ.. RSR స్కూల్ లో జరిగే పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఎంపీ వేమిరెడ్డి తో కలిసి పాల్గొన్ననున్న మంత్రి నారాయణ
* నేడు శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకంబరీ ఉత్సవం.. ఆషాడ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి ఆకుకూరలు,కూరగాయలతో అలంకరణ.. అమ్మవారితోపాటు రాజరాజేశ్వరి,సప్తమాతృకులు,గ్రామదేవతకు శాకాంబరి అలంకరణ
* గుంటూరు: నేటినుంచి ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ, యూజీ, డిప్లమో పరీక్షలు.. రాష్ట్ర వ్యాప్తంగా114సెంటర్లలో పరీక్షలు.
* నేడు కాకినాడ లో పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్..
* అన్నమయ్య జిల్లా : రాయచోటి పట్టణం కె.రామాపురం జడ్పీ హైస్కూల్లో జరిగే పేరెంట్స్, టీచర్స్ మెగా మీట్ కు హాజరుకానున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
* అనంతపురం : ఉరవకొండ లో జరిగే టీచర్స్, పేరెంట్స్ మీట్ మెగా కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్.
* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు.. మూడు గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల.. ఇన్ ఫ్లో 1,72,829 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,48,625 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 882.70 అడుగులు.. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* కర్నూలు: మెగా పేరెంట్స్ మీట్ లో పాల్గొననున్న మంత్రి టిజి భరత్
* విజయనగరం జిల్లా: శృంగవరపుకోటలో గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయి నాధుని ఆలయంలో భక్తులు తాకిడి, భక్తులు ఉదయం నుంచి సాయినాధునికి పాలాభిషేకాలు చేశారు