డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు.
కన్నప్ప సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో ఈ రోజు మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచి, తెలంగాణలో పెంచకపోవడం పై మీడియా నుంచి ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అసలు టికెట్ హైక్ తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. “ఏ రోజు థియేటర్లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్ ధరలు తగ్గిస్తారో, తెలంగాణలో ఆ రోజు నేను మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లు పెంచడానికి ఆలోచిస్తాను. ఎందుకంటే…
Tejeshwar Murder : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన తేజేశ్వర్ హత్యకేసులో అసలు కథ బయటపడింది. ఈ కేసుపై గద్వాల జిల్లా ఎస్పీ ఒక ప్రెస్‌మీట్ నిర్వహించి నిందితుల కుట్రను బహిర్గతం చేశారు. తేజేశ్వర్ హత్య వెనుక ఉన్న ప్రేమ, ద్వేషం, కుట్రలను ఎస్పీ వివరించారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబం తేజేశ్వర్‌తో ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో…
Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌గా ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తంగా రూ.180.38 కోట్ల బిల్లులు విడుదల చేయడం ద్వారా దాదాపు 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ, సంక్షేమ పథకాల…
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో రూలింగ్‌లో ఉన్న బీజేపీకి మధ్య ఢిల్లీ నుంచి గల్లీ దాకా... వాట్సాప్ నుంచి ఇన్‌స్టా వరకు వార్... నువ్వా నేనా అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. రెండూ జాతీయ పార్టీలు, ఈసారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది కాబట్టి... పొలిటికల్ విమర్శలు, సవాళ్లు కామన్. కానీ కరీంనగర్ పొలిటికల్ సినారియో మాత్రం..
తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అలంపూర్ నియోజకవర్గం రాజకీయ మలుపుల్లో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటోంది. ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది.... టికెట్ల పంపిణీ వరకు సస్పెన్స్ గానే ఉంటోంది గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి. ఈ క్రమంలో.... రెండు సార్లు అలంపూర్ ఎమ్మెల్యేగా పని చేసిన అబ్రహం... ఈసారి పార్టీ మారి కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని,
తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె మిస్టర్ ఇండియా 2025 టైటిల్‌ను సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన ఈ రాకేష్, గోవాలోని గోల్డెన్ క్రౌన్ రిసార్ట్స్‌లో జూన్ 19న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుని తాజాగా బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో త్వరలోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. రాకేష్ ఆర్నె మాట్లాడుతూ. సినిమా రంగంలో అడుగుపెట్టాలన్న ఆకాంక్షను…
తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక…