మంత్రి సీతక్కకు మావోయిస్టులు హెచ్చరికలు పంపారు. సీతక్కకు వార్నింగ్ ఇస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా.. మంత్రి సీతక్క మౌనంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు మావోలు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించారు. Also Read:TGEAPCET 2025: టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు…
టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ రిలీజ్ చేసింది. మూడు విడతల్లో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్ కి జూన్ 28 నుంచి జులై 7వ తేదీ వరకు స్లాట్ బుక్ కింగ్ కి అవకాశం ఇచ్చారు. జులై 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్.. జులై 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు.. జులై…
Weather Update : తెలంగాణ రాష్ట్రంలో ఈ వారాంతం వరకు వర్షాలు మేల్కొలుపు గానుండనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జూన్ 29వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. Priya Vadlamani : పరువాల ప్రదర్శన చేస్తున్న ప్రియా వడ్లమాని.. వాతావరణ శాఖ…
TG Cabinet : సుపరిపాలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ సమావేశాల నిర్వహణలో మార్పులు, క్రమబద్ధీకరణకు దారితీసేలా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, తదుపరి సమావేశం జులై 10న జరగనున్నది. ఈ సమావేశంపై మంత్రులకు ఇప్పటికే ముందస్తుగా సమాచారం అందించడంతోపాటు, ఇకపై ఈ ప్రక్రియను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడో కొత్త రకం చర్చ మొదలైందట. పార్టీలో అందరిదీ ఒక లైన్ అయితే... జగ్గారెడ్డిది మరో లైన్ అని మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. గాంధీభవన్‌లో ఇటీవల పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లో జగ్గారెడ్డి అన్న మాటల గురించే ఇప్పుడు చర్చ అంతా. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో బాగా ప్రచారం జరగాలంటే... కార్యకర్తలని సంతోషపెట్టడం ముఖ్యమని సూచించారట ఆయన.
మరోసారి తెలంగాణలో ఆంధ్రా బిర్యానీని ఉడికించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత వంటకాలను, అలవాట్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండార్స్ చేస్తూ కవిత తాజాగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉద్యమకారులను ఉద్దేశించి ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రా ప్రాంతంలో వండే బిర్యానీని పేడతో పోల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆంధ్రా ప్రాంత ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసించారు. సోషల్ మీడి
హైదరాబాద్‌లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. రాత్రి పూట అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలడం లేదు. అలాగే ప్రకాష్ అనే యువకుడు ఓ యువతిని నమ్మించి తన రూమ్‌కు తీసుకు వెళ్లాడు. తర్వాత అఘాయిత్యం చేశాడు. పైగా వాటిని వీడియో తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. అర్ధరాత్రులు ఇంటి నుంచి బయటకు రావడం.. ఏదైనా అకృత్యాలు జరిగిన తర్వాత పోలీసులను ఆశ్రయించడం కామన్ అవుతోంది. ఎన్నో కేసులు…
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఎప్పటికప్పడు కొత్త కొత్త ట్విస్ట్‌లు పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టు సిట్ కూడా కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతేహై... అన్నట్టుగా ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూనే ఉంది. కానీ... తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం సిట్ బృందానికి కూడా ఎక్కడో డౌట్ ఉందా అన్న అనుమానాల్ని పెంచుతున్నాయట.
రామ్‌చరణ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు నుంచి తెలుసని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ హీరో అయ్యాడు. RRR తో దేశానికి గౌరవం తెచ్చి పెట్టాడని కొనియాడారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. తాజాగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్, హీరోలు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, విజయ్…