Telangana Urea Supply: ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పోరాటం ఫలించింది. రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాపై వారు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టడంతో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ స్పందించింది. ఈ వారంలోనే తెలంగాణకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా రవాణా ఇప్పటికే ప్రారంభమైంది. అదేవిధంగా ఈ వారంలోనే మరిన్ని మూడు షిప్‌మెంట్‌ల ద్వారా యూరియా సరఫరా…