తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) తమ బస్సు టికెట్ ధరలను 50 శాతం పెంచిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.
దసరా , బతుకమ్మ పండుగల సీజన్ సమీపిస్తుండటంతో, సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులను నడపాలని నిర్ణయించింది.
తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్ట్రేషన్ పొందిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరిగా అమర్చుకోవాలని స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న 14 బార్డర్ చెక్‌పోస్టులు, కామారెడ్డి జిల్లాలోని మరో ఆర్టీఏ చెక్‌పోస్ట్‌ను పూర్తిగా తొలగించింది.
తెలంగాణ రవాణా శాఖలో సర్వీస్ ఛార్జీలు భారీగా పెరిగి వాహన యజమానులపై అదనపు భారం పడింది. టాక్సేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఛార్జీలను గణనీయంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
TGSRTC : తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించి, సమ్మె నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సంస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తున్న సమయంలో సమ్మె అనేది తీరని నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది. 2019లో జరిగిన సమ్మె సంస్థను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయగా,…
TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సమ్మె నోటీసుపై స్పందిస్తూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మెపై పునరాలోచించాలని కోరారు. ఈ సమయంలో ఆర్టీసీ సమ్మెకు అనుకూల పరిస్థితులు లేవని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి పూర్తిగా సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పోరాటం ఎంతో కీలకంగా నిలిచిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ…
Ponnam Prabhakar: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత పోర్టల్ ‘‘వాహన్ సారథి’’లోకి నేడు ( ఏప్రిల్ 30)న తెలంగాణ రాష్ట్రము చేరింది. సికింద్రాబాద్ లో ఉన్న RTO కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ‘సారధి పోర్టల్’ ప్రారంభోత్సవం చేసారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో వాహనదారులకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా సారధి పోర్టల్ ను లాంచ్ చేశారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సేవలను సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.…