ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 26న రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రాక అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు 20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలంతా రాష్ర్టానికి వస్తుండటం మరింత…