దాదాపు ఒక లక్షకు పైగా అధికారులు, సిబ్బంది ఉన్న రాష్ట్ర పోలీస్ శాఖ తమ అధికారులు, సిబ్బంది సంక్షేమానికై మరో ముందగు వేసింది. ఇప్పటికే ఆరోగ్య భద్రతా ఏర్పాటు ద్వారా పోలీసుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించిన పోలీస్ శాఖ ప్రతీ అధికారి, సిబ్బంది తమ పదవీ విరమణలోగా కనీసం ఒక ఇంటిని లేదా ఫ్లాట్ ను కలిగి ఉండేలా తగు ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా ‘తెలంగాణా స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ’ అనే విభాగాన్ని…