నాగార్జునసాగర్ డ్యాం భద్రత తెలంగాణ స్పెషల్ పోలీస్ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పటివరకు భద్రత విధులు నిర్వహించిన కేంద్ర పారా మిలిటరీ బలగాలు వెనక్కి వెళ్లడంతో... ఎస్పీఎఫ్ డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజు నాగార్జునసాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.