Telangana: దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతో పాటు పాఠశాలలను ప్రారంభించి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
పిల్లలు పాఠశాలకు వచ్చేందుకు, పాఠశాలపై ఆసక్తి చూపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను పెయింటింగ్స్ తో నింపనుంది. ఈ నేపథ్యంలో పిల్లలకు ఇష్టపడే కార్టూన్‌లు, జంతువులు, నైతిక విలువలు తెలిపే చారిత్రక నిర్మాణాలతో అందమైన పెయింటింగ్‌లు, చిత్రాలతో, ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో గోడలు, భవనాలు, తలుపులు, కిటికీలు త్వరలో విద్యార్థులకు అభ్యాస సామగ్రిగా మారనున్నాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం…
తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే సెలవుల పొడిగింపు ప్రకటనను ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్-TRSMA) తీవ్రంగా ఖండించింది. అవగాహన లేకుండా విచ్చలవిడిగా కోవిడ్ వాహకాలుగా తిరిగి కోవిడ్ కేసులను పెంచుతున్న వారిని పట్టించుకోకుండా విద్యాసంస్థలను మూసివేయడమేంటని ప్రభుత్వాన్ని ట్రస్మా ప్రశ్నించింది. Read Also: కోవిడ్ ఎఫెక్ట్: రేపటి నుంచి ఆన్ లైన్ క్లాసులు మార్కెట్లు, సినిమా…
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.. నిన్న లక్ష దాటేసి 1.14 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. ఇవాళ ఏకంగా 1,41,986 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. తెలంగాణలో నిన్న దాదాపు 3 వేల పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో 840 కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్ ఆంక్షలు కూడా విధించింది ఆంధ్రప్రదేశ్.. ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూకు వెళ్తున్నారు.. ప్రస్తుతానికి తెలంగాణలో…
పద్దెనిమిది నెలల తరువాత తెలంగాణాలో మళ్ళీ ఈ నెల 1వ తారీఖు నుంచి స్కూల్స్ తెరుచుకున్నాయి. అయితే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో విద్యార్థులు స్కూల్స్ కి ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది.గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 5,526 ప్రైవేటు.. 2,249 గవర్నమెంట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 16 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరిలో తొలి రోజు చాలాచోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగానే కనిపించింది. సుమారు 21.77 శాతం మంది…
కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు విద్యకు దూరంగా ఉన్న విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్ణయంతో బడిబాట పట్టారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఒక్కొక్కరుగా స్కూలుకు చేరుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెశామని చెబుతున్నా… కరోనా భయం మాత్రం విద్యార్థులను వీడడం లేదు. తెలంగాణ స్కూళ్లలో అప్పడే కరోనా కలవరం మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. వారంపాటు…
దాదాపు 18 నెలల తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు… ఓవైపు రేపటి నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇస్తూనే.. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయవద్దన్న హైకోర్టు, విద్యార్థులు, మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తేవద్దు.. పేరెంట్స్ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని పేర్కొంది. కేవలం గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది.. గురుకులాలు, విద్యాసంస్థల్లో…
దాదాపు 18 నెలల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో… బడులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఏడాదిన్నర తర్వాత… విద్యార్థులకు ప్రత్యక్ష బోధన జరగనుంది. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో శానిటైజేషన్, క్లీనింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు… తరగతి గదులను శుభ్రం చేస్తున్నాయి. క్లాసు రూమ్‌లతో పాటు బెంచ్‌లు, కుర్చీలను… శానిటైజ్ చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే… ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల…