తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియాను ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దం పట్టే గ్లోబల్ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. సిటీ విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రజలు గ్రేటర్ సిటీకి లక్షలాది కుటుంబాలు…