Kadam Project: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈక్రమంలో కడెం పరివాహక ప్రాంతానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో బుధవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు కిందికి వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ విట్టల్ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 20.138 క్యూసెక్కులు ఔట్ ఫ్లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు, మొదలైన జీవాలు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.…
Telangana Rain: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.