Kadam Project: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈక్రమంలో కడెం పరివాహక ప్రాంతానికి భారీగా వరద నీరు చేరింది. దీంతో బుధవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు కిందికి వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ విట్టల్ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 20.138 క్యూసెక్కులు ఔట్ ఫ్లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు, మొదలైన జీవాలు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే గొర్రెల కాపరులు, రైతులు కూడా అటు వైపు వెళ్లవద్దని కోరారు.
READ ALSO: CM Chandrababu: వినాయకుడు అంటే తమషా కాదు.. వడ్డీతో సహా వసూలు చేస్తాడు!
నిర్మల్ జిల్లా కేంద్రంలో గత 3 గంటలుగా ఏకదాటిగా వర్షం కురవడంతో పట్టణంలోని శివాజీ చౌక్, డాక్టర్స్ లేన్ రోడ్స్ జలమయం అయ్యాయి. నటరాజ్‌నగర్, దివ్యానగర్, ప్రియదర్శినినగర్, ఈద్‌గామ్ ఎస్సీ కాలనీ వంటి కాలనీలు నీట మునిగాయి. నటరాజ్ నగరలోని పలు ఇండ్లలోకి వరద నీరు చేరింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అవసరం అయితేనే బయటికి రావాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. అధికారులందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు.
READ ALSO: Asteroid Near Earth: భూమికి ప్రమాదం ఉందా? నాసా ఎందుకు ఆందోళనతో ఉంది..