Telangana Bandh Today: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.