రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్‌లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, మరి తెలంగాణ రైతులు పండించిన ధాన్యానికి ఉప్పుడు బియ్యమని, దొడ్డు బియ్యం అని, రా రైస్ అని ఎందుకు వంకలు పెడుతున్నారని విమర్శించారు. పంజాబ్ వడ్లు ఎలా తియ్యగైనయని, తెలంగాణ వడ్లు చేదెందుకైనవని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో రైతుబంధు సమితి…