మెడికల్ విద్యార్థిని నాగాంజలి మృతి: లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికల్ విద్యార్థి నాగాంజలి మృతి చెందింది. పది రోజులుగా ప్రాణాలతో పోరాడి.. రాత్రి రెండు గంటల సమయంలో కన్నుమూసింది. నాగాంజలి మృతి చెందినట్లు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్దకు వైద్య బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. నాగాంజలి మృతదేహాన్ని కిమ్స్…
వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీ కోసం నేడు మున్సిపల్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లను త్వరితగతిన జారీ చేసేలా ప్రణాళిక చేయనుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో…
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంస్థ యజమాని శ్రవణ్రావు బుధవారం మరోసారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఎదుట హాజరుకానున్నారు. గత విచారణలో ఆయనను అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వకపోవడంతో, అధికారులు ఆయనకు తిరిగి నోటీసులు పంపారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారంతా పోలీసు అధికారులే కాగా, శ్రవణ్రావు మాత్రం ప్రైవేట్ వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకున్నారు? ఎస్ఐబీ, టాస్క్ఫోర్స్ అధికారులతో ఆయనకు పరిచయం…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ అంశంపై విద్యార్థుల ఆందోళనలతో పాటు రాజకీయ నాయకుల ప్రస్తావనలు పెరుగుతున్నాయి. తాజాగా, తెలంగాణ భవన్లో HCU విద్యార్థులతో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ ఆందోళనలను వ్యక్తం చేయగా, కేటీఆర్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “HCU భూములు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆరాటపడుతుంది?”…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువులో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు ప్రకటించినప్పటికీ, మృతుల కుటుంబ సభ్యులు మాత్రం హత్యగా ఆరోపిస్తున్నారు. భర్త యేసు తన ముగ్గురు పిల్లలతో పాటు రెండో భార్యను చెరువులో తోసి హత్య చేశాడని చిన్నారుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే…
ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఇక, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సమన్వయ పరుస్తున్నాం.. ప్రజలు ముందుకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక…
Singareni : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉన్న సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో నిన్న సాయంత్రం నుంచి విజిలెన్స్ దాడులు కొన సాగాయి. సి ఎం ఓ లో మెడికల్ అధికారి గా ఉన్న ఆమె భర్త ,కూతురు సెల్ ఫోన్ విజిలెన్స్ శాఖ సంబంధించిన పైళ్ళు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఈనెల 31న రిటైర్మెంట్ కావలసి ఉండగా తాజాగా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన…
Pastor Praveen : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్ కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కీలక ప్రకటన చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఈనెల 24వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి, రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఐజీ అశోక్ మాట్లాడుతూ, “పాస్టర్ ప్రవీణ్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటుప్పల్ టోల్…
హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. బుధవారం రాత్రి హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీ.సీ కెమెరాల్లో లభించిన వీడియో ఆధారంగా వరంగల్లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో విషాదం చోటుచేసుకుంది. తల్లి ముగ్గురు చిన్నారులను అన్నంలో విషం కలిపి తినిపించింది. తాను ఆహారం ద్వారా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు చిన్నారులు పిల్లలు సాయి కృష్ణ (12), మధుప్రియా (10), గౌతమ్ (8) మృతిచెందారు. తల్లి రజిత తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.