Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాంపల్లి గన్ పార్క్ , సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వంటి ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి జపాన్ ప్రతినిధి బృందం ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలోని జపాన్ ప్రతినిధి బృందం ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. రేపు…