Toshiba : తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి…
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జపాన్ పారిశ్రామికవేత్తలు…
CM Japan Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 18 (శుక్రవారం)న టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను సీఎం చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టోక్యో పర్యటనను గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తూ ప్రారంభించనున్నారు. అనంతరం టోక్యో గవర్నర్‌ను…
Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జపాన్ పర్యటనలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారుల బృందం ఈ పర్యటనలో భాగంగా జపాన్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవబోయే కార్యక్రమం జపాన్‌లో తొలిసారిగా నిర్వహించబోయే ఒసాకా ఇండస్ట్రియల్ ఎక్స్ పో. ఈ ఎక్స్ పోలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఇండియన్ పెవిలియన్‌లో తెలంగాణ…
TPCC Mahesh Goud : రాష్ట్రానికి ఏడాది కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… పెట్టుబడులకు కేరాఫ్ తెలంగాణ గా మారిందన్నారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, గతంలో పెట్టుబడి పెట్టిన కంపెనీలు… పనులు కూడా ప్రారంభించాయన్నారు. ఫోర్త్ సిటీ లోకి పెట్టుబడులు రాబోతున్నాయి.. గేమ్ ఛేంజర్…
Davos 2025 : దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోస్ వెళ్లిన తెలంగాణ బృందం పది ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల్లో రూ.1,32,500 కోట్ల పెట్టుబడులు, 46,000 ఉద్యోగాలు రాబట్టింది తెలంగాణ ప్రభుత్వం. Anil Ambani: నెల్లూరులో అనిల్ అంబానీ పర్యటన.. పవర్ ప్లాంట్ భూముల పరిశీలన 1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు.…
World Economic Forum : ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ చేరుకున్నారు. విజయవాడ నుండి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడ నుంచి అర్ధరాత్రి…
సింగపూర్ పర్యటనలో మూడు రోజుల పాటు సీఎం, మంత్రి, రాష్ట్ర బృందం విశేషంగా కార్యకలాపాలు నిర్వహించింది. కీలక చర్చల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, అవకాశాలను ఆకర్షించింది. సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అవగాహన కుదిరింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ముందుకొచ్చింది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ రూ.450 కోట్లతో హైదరాబాద్‌లో ఐటీ…
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్, పర్యాటక శాఖకు సంబంధించి రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం అటవీ భూముల అనుమతులపై చర్చించారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రి కొండా సురేఖ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి, రాష్ట్రం నుంచి పంపించిన ప్రతిపాదనలను త్వరగా ఆమోదించాలని కోరారు. భూపేందర్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో…
KTR : తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ కార్ రేసును రాష్ట్రానికి తీసుకువచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో హైదరాబాద్‌ను ప్రధాన గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక దృష్టితో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించామని తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో ఇన్నోవేషన్, రీసెర్చ్, , తయారీ రంగాల్లో పెట్టుబడులు అందించడం ద్వారా ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ ప్రధాన…