CM Japan Tour: నేడు టోక్యోలో బిజీబిజీగా గడపనున్న సీఎం.. నేటి షెడ్యూల్ ఇలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Japan Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 18 (శుక్రవారం)న టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను సీఎం చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టోక్యో పర్యటనను గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తూ ప్రారంభించనున్నారు. అనంతరం టోక్యో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడంలో కీలకంగా మారనుంది.
తర్వాత, భారత ఎంబసీ ఆధ్వర్యంలో జరగనున్న పారిశ్రామిక ప్రతినిధుల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఇందులో టయోటా, తోసిబా, ఐసిన్, ఎన్టీటీ వంటి దిగ్గజ సంస్థల సీఈవోలతో వేర్వేరుగా భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనపై చర్చించనున్నారు. ఆ తర్వాత, జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (JOIN) ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణలో నగరాభివృద్ధి, రవాణా రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గాలు చర్చించనున్నారు.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
అంతేకాకుండా, టోక్యోలోని ప్రసిద్ధ సుమిదా నది తీర ప్రాంతం (Sumida River Front) ను సీఎం సందర్శించనున్నారు. ఈ సందర్శన ద్వారా నగర ప్రణాళికల్లో కొత్త ఆలోచనలకు ప్రేరణ లభించే అవకాశం ఉంది. ఈ పర్యటన తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల రాకకు దారితీసేలా, రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారేలా ఉండబోతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!