మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులలో 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశపరీక్షకు 87.4మంది విద్యార్థులు హాజరయ్యారని కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన వారిలో 86.7 శాతం మంది, ఏడో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన వారిలో 89.8శాతం విద్యార్థులు, ఎనిమిదో తరగతి కోసం దరఖాస్తు చేసిన వారిలో 84.8 శాతం మంది…