ఉద్యమాన్ని అణిచి వేయడానికి ప్రభుత్వం సెలవులు ఇచ్చిందని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె. రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలే అయిందన్నారు. 135 పని దినాల్లో అందులో ప్రత్యేక కార్యక్రమాలు, పరీక్షలు పోనూ జరిగిన బోధనా గంటలు మరీ తక్కువ.ఈ పరిస్థితుల్లో సెలవులను కుదించి, విద్యార్థులకు నష్ట నివారణకు చర్యలు చేపట్టకుండా సెలవులు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో లోకల్…
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టింగ్ లలో స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనో వేదనకు గురి చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో కోరారు. ఇంకా ఆయన ఈ లేఖలో రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం డిసెంబర్ 6న జీవో నెంబర్ 317ను జారీ చేసింది.…
ప్రభుత్వ ఉద్యోగమంటే.. పదోన్నతులు.. బదిలీలు కామన్. సమయం సందర్భాన్ని బట్టి అవి జరిగిపోతూ ఉంటాయి. తెలంగాణలో టీచర్లకు మాత్రం ఈ రెండు అంశాలు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. కొన్నేళ్లుగా గ్రహణం వీడటం లేదు. ఎందుకిలా? ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదా? లేక.. టీచర్ల వైపు నుంచి ఏదైనా లోపం ఉందా? పదోన్నతులు.. బదిలీలకు టీచర్లు దూరం..! తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆరేళ్లుగా పదోన్నతులు లేవు. మూడున్నరేళ్లుగా బదిలీలు బంద్. ఈ రెండు అంశాలపై ఉపాధ్యాయ సంఘాలు పోరాటం…