Fire Accident : హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్‌లో బోట్లపై బాణాసంచా కాల్చుతుండగా, అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హుస్సేన్ సాగర్‌లో రెండు బోట్లు మంటల్లో కాలి పోయాయి. ఈ బోట్లలో ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 15 మంది ప్రయాణిస్తుండగా, వారందరూ బోట్ల నుంచి…