Skill University Admission: తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
సచివాలయంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ (SRDS) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, సిగ్నళ్లు, యూటర్న్లు లేకుండా చర్యలు చేపట్టింది. 826 కోట్ల రూపాయలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు పాలనాపరమైన అనుమతులిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
కాంగ్రెస్.. రాహూల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రుణమాఫీ చేశారని.. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా... 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి తీర్మానం చేసి... 18 వేల కోట్లు బ్యాంకుల ఖాతాలో వేశారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
Hydra Team: మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మూసీ వద్ద ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది.
సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రేవంత్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రీప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Rythu Runa Mafi: రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు, రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలు, సాంకేతిక సమస్యలతో రుణమాఫీ చేయని అర్హులైన రైతులు మిగిలిపోతారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగర ప్రజలకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాలు మరింత మెరుగు పర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్.. జీవో Rt.No.345 జారీ చేశారు. గోదావరి రెండో దశ పనులకు రూ.5560 కోట్లు కేటాయించింది.