హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్బీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్, డీజీఎంజితేందర్ శర్మ , ఏజీఎం దుర్గా ప్రసాద్, తనుజ్‌లు పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5కోట్లు సీఎం సహాయనిధికి ఎస్బీఐ ప్రతినిధులు విరాళంగా అందించారు.
ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని తాజాగా నిరూపితం అయింది. మొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇప్పటికే చాలా మంది సినీ హీరోలు తమ విరాళాలు ప్రకటించగా ఇప్పుడు చిత్ర పరివ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ…
భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కెనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు.
Vyjayanthi Movies Announces to Donate 20 Lakhs for Telangana CM Relief Fund: తెలుగు రాష్ట్రాల వరదల నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరికంటే ముందుగా వైజయంతి మూవీస్ బ్యానర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పాతిక లక్షల రూపాయలు ప్రకటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మొదలుపెట్టి టాప్ హీరోలందరూ అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి నిధికి విరివిగా…
Ram Charan Announces 1 Crore for Ap and Telangana CM Relief Funds: తెలుగు రాష్ట్రాల వరదల నేపథ్యంలో ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రముఖులు తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి హీరోలు తమ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అనౌన్స్…
Pawan Kalyan Announced 6 Crores Donation for Telugu States: పవర్ స్టార్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు. నిజానికి గత కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు వరదమయమైన పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఇంకా వరద నీరు తగ్గక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో…
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనా వేయడంపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Telugu Heroines Ignoring Floods in telugu States: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడ లాంటి చోట్ల గత మూడు నాలుగు రోజుల నుంచి అన్నం కూడా దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం తాము చేస్తూనే ఉన్నాయి. అయినా పూర్తిస్థాయిలో ప్రజలను సంతృప్తి పరచలేకపోతున్న నేపద్యంలో చాలావరకు ప్రైవేటు సంస్థలు జనసేన, తెలుగుదేశం,…
రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 117 గ్రామాలలో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యాయని మంత్రి చెప్పారు.