Heavy Rains: హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడి, ఈశాన్య దిశగా కదులుతున్న ‘మొంథా’ తుఫాన్ అర్ధరాత్రి తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ తుఫాన్ ప్రభావం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. హైదరాబాద్ సహా అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.
Medak – Kamareddy : తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో అధికారులు ఈ రెండు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కామారెడ్డిలో 41 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు మెదక్ లోనూ వర్షాల ఉధృతి ఆగట్లేదు. ఈ రెండు జిల్లాల్లోని చెరువులు అన్నీ మత్తడి దుంకుతుండగా.. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ఊర్లు నీటమునిగాయి. రోడ్లు తెగిపోయాయి. పదుల…