బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూర్, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజక వర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో అలంపూర్ కు వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయభేరి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
సూర్యాపేట జిల్లాలోరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్కపై (శిరీష) నిన్న దాడి జరిగింది. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు.
నేడు నాలుగు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షో లు నిర్వహించబోతున్నారు. మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రేవంత్ రెడ్డి 4 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఈరోజు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే, నారాయణఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
మెదక్ లో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ కోట్ల భూములు దోచుకున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తుందని, సీఎం కూతురు లిక్కర్ స్కామ్ breaking news, latest news, telugu news, vijayashanti, congress, telangana elections 2023
Devendra Fadnavis: కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో కుటుంబ పాలన ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. తెలంగాణను బీఆర్ఎస్ లూటీ చేసిందని మంగళవారం దుయ్యబట్టారు. ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే సాగుతోందని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఫడ్నవీస్ ఆరోపించారు. అవినీతి ఒలింపిక్స్ నిర్వహిస్తే అన్ని పథకాలు బీఆర్ఎస్ పార్టీకే వస్తాయని, తెలంగాణలో అంత అవినీతి జరిగిందని ఎగతాళి చేశారు.