అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎల్లపల్లి గ్రామంలో ఓటు హక్కు వేశారు.
కాచిగూడలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదని ఆయన తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
పాతబస్తీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. మలక్ పేట్, చార్మినార్, యాకుత్ పురా, చంద్రయాన్ గుట్ట, బహదూర్ పురా, కార్వాన్, గోషామహల్ ఏడు నియోజకవర్గాలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. పాతబస్తీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టవంతమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించే ఏపీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్న ఏపీ ఉద్యోగులకు రేపు ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉద్యోగుల సంఘం నేతలు చేసిన విజ్ఞప్తికి ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల పోరాటం, నీళ్లు - నిధులు - నియామకాల కోసం ఆరాటం, లాఠీ దెబ్బలు, రబ్బరు బుల్లెట్ల గాయాలు, టియర్ గ్యాస్‌తో కళ్ల మంటలు.. ఇవి సరిపోవడం లేదని 1969లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పోలీసుల కాల్పుల్లో 369 మంది విద్యార్థుల బలిదానం, మలిదశ ఉద్యమంలో మనకళ్లముందే 1200 మంది ఆత్మబలిదానం, చిన్న నుంచి పెద్ద వరకు, సకల జనులంతా ఏకమై..…
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సందేశం ఇచ్చారు. ప్రియమైన సోదర సోదరీమణులారా.. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా.. కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారని వీడియో సందేశంలో తెలిపారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్నాని అన్నారు.
Jagga Reddy: నా మనసులో మాట చెప్తున్నాను అని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హరీష్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థికి ఒక సూటి ప్రశ్న? అని తెలిపారు
Bhatti Vikramarka: కాంగ్రెస్ అంటేనే కరెంట్.. అర్ధం చేసుకో పిచ్చొడా..? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంపదను పేదలరు పంచేందుకే ఆరు గ్యారెంటీల ప్రకటన అన్నారు.
Revanth Reddy: కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే నేను ఇక్కడ పోటీకి దిగా అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కామారెడ్డి భూముల పై కన్నేశాడని మండిప్డారు.