Bhatti Vikramarka: కాంగ్రెస్ అంటేనే కరెంట్.. అర్ధం చేసుకో పిచ్చొడా..? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంపదను పేదలరు పంచేందుకే ఆరు గ్యారెంటీల ప్రకటన అన్నారు. పదేళ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్.. అర్ధం చేసుకో పిచ్చొడా..? అన్నారు. రైతులకు మేమ చాలా మేళు చేశాం అన్నారు. రైతులకు అందే ఎన్నో సబ్సిడీ పథకాలను కేసీఆర్ రద్దు చేశారని అన్నారు. రైతులను.. కౌలు రైతులను.. రైతు కూలీలను ఆదుకుంటామన్నారు.
Read also: Illness Cases : అనారోగ్యం బారిన పడిన పిల్లలపై నిఘా ఉంచండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
ఇళ్ల స్థలాలిస్తాం.. ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలిస్తామన్నారు. చదువుకున్న యువత సప్లయిర్ల ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. నిరుద్యోగ యువత బాధలు చూస్తోంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. ప్రతేడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.. రైతు రుణ మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. రోజుకో దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు కేసీఆర్..! దంచుదాం.. దించుదాం.. సంపద పేదలకు పంచుదాం అని మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీ తర్వాత కేసీఆర్ ఉండడు.. బీఆర్ఎస్ పార్టీ కూడా ఉండదు అన్నారు. ఆడపిల్లలకు పెళ్లి కానుకతో పాటు తులం బంగారం పెడుతున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా మేనిఫెస్టో రూపొందించామన్నారు. గ్రామంలో ఇంకా కొన్ని రోడ్లు పూర్తి కావాల్సి ఉన్నాయని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రోడ్లు కూడా వేయలేకపోయారని అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. అన్ని రకాలుగా గ్రామాల్లో రోడ్లు వేస్తామన్నారు.
Read also: Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను వీడనున్న బుమ్రా.. కారణం అతడేనా?
మధిర నియోజకవర్గం చొప్పకట్లపాలెం గ్రామంలోని బొనకల్లు మండలం గ్రామ దేవాలయం వద్ద రూ.100 స్టాంపుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంతకం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తమదేనన్నారు. మధిర నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే కాంగ్రెస్ పార్టీ ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామన్నారు.
Vetrimaaran: వడ చెన్నై కాంబినేషన్ రిపీట్… ఆ యాక్టర్ ని కలిసిన వెట్రిమారన్