తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు శుభావార్త చెప్పింది. కరోనా కారణంగా సిలబస్ పూర్తి కాకపోవడం, ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించడం లాంటి కారణాలతో విద్యాశాఖ 50 శాతం ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాబోయే ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022లో విద్యార్థులకు పెద్ద ఉపశమనంగా, వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది. ఆబ్జెక్టివ్ పార్ట్‌లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా ఛాయిస్ ప్రశ్న పత్రాల థియరీ విభాగాలలో మార్పలు…