Earthquake: తెలంగాణలో పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది. ఈ భూ ప్రకంపనలు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల సుల్తానాబాద్ లో వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, జన్నారంలో కూడా భూమి కనిపించినట్లు తెలుస్తోంది. భూమి ఒక్కసారిగా ప్రకంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే ఆస్థి,…
Earthquake: బుధవారం ములుగు జిల్లాలో సంభవించిన భూకంపంతో తెలంగాణ ఒక్కసారిగా వణికిపోయింది. తెల్లవారుజామున 7.27 గంటలకు ములుగులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. భూకంపం భూమి ఉపరితలం నుంచి 40 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం సమీపంలోని మంచిర్యాల, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపనలు కనిపించాయి.
తెలంగాణలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి… ఇవాళ మధ్యాహ్నం వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్, వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.. ఇక, ఊహించని ఘటనలో భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.. దమసాపూర్, భుచ్చన్‌పల్లి, మర్పల్లి గ్రామల్లో కూడా భూమి కంపించినట్టు చెబుతున్నారు.. ఇక, ఈ సమయంలో భూమి నుంచి భారీ శబ్ధాలు వచ్చినట్టు తెలుస్తోంది.. భూమి కింది…