నిజామాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి దోపిడీకి పాల్పడ్డారు. వినాయకనగర్‌లో నివసించే వృద్ధ దంపతులను టార్గెట్ చేసి, “డిజిటల్ అరెస్ట్” పేరుతో భయపెట్టి ఏకంగా రూ.40 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో వృద్ధుడికి వాట్సాప్ వీడియోకాల్ వచ్చింది. తాము ముంబయి పోలీసులు అని పరిచయం చేసుకున్న నిందితులు నకిలీ ఐడీ కార్డులు చూపించారు. మీ బ్యాంకు ఖాతా మనీలాండరింగ్…