Former Naxalite Murder: ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్య్వూ మాజీ నక్సలైట్ ప్రాణం తీసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో మాజీ నక్సలైట్‌ను దారుణ హత్య చేశాడు ఓ వ్యక్తి. తంగళ్లపల్లి (మం) గండిలచ్చపేటకు చెందిన బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య అనే మాజీ నక్సలైట్‌ను సంతోష్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు. నరసయ్యను హత్య చేసిన తరువాత జగిత్యాల పోలీసులు లొంగిపోయాడు సంతోష్..
Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో హత్య ఘటన వెలుగు చూసింది. దుండగులు ఆటోలో వచ్చి విచక్షణ రహితంగా చంపారు. గుడ్ విల్ హోటల్లో చాయ్ తాగుతున్న సమయంలో ఓ వ్యక్తి పై దాడి చేశారు. చనిపోయిన వ్యక్తి నీ మహబూబ్ గా గుర్తించారు. కత్తులు, కొబ్బరి బొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపారు. హత్యాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Medak murder case: మెదక్ జిల్లా మగ్దుంపూర్‌లో యువకుడి డెడ్ బాడీకి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మైనర్ అమ్మాయి న్యూడ్ వీడియోలు, ఫోటోలు దగ్గర ఉంచుకుని బెదిరించడమే హత్యకు కారణంగా గుర్తించారు. యువకున్ని హైదరాబాద్ బోరబండకు చెందిన సబిల్‌గా నిర్ధారించారు. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు సబిల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్లాపూర్‌లో ఓ మెకానిక్ షెడ్‌లో మెకానిక్‌గా పని చేశాడు.
హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి.. ఒకే రోజు మూడు హత్యలు వెలుగు చూశాయి. మూడు హత్యలూ అనుమానాస్పదమే !! కూకట్‌పల్లిలో బర్త్‌డే పార్టీకని పిలిచి ఓ యువకుడిని హత్య చేయగా... నాగోల్‌లో జూస్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా హత్య చేశారు. బహదూర్‌పురలో ఓ యువకుడిని హతమార్చారు గుర్తుతెలియని వ్యక్తులు. వరుస హత్యలకు కారణమేంటి..? మూడు హత్యల్లో దాగున్న మిస్టరీ ఏంటి...?