కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు ప్రతిష్టంభన తొలగింది. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియరైంది. తెలంగాణలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో కిషన్‌రెడ్డి మాట్లాడి పరిస్థితిని వివరించారు. రైతులను ఆదుకోవాలని కోరారు.