Congress CM: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టినప్పటికీ ఎవరు అధికార పీఠాన్ని అధిరోహిస్తారని దానిపై ఇంకా క్లారిటీ లేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులు కావస్తున్నా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు ఆవిరైపోయాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి.