రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. శాసనసభ సమావేశాల నిర్వహణ, వివిధ రంగాల్లో సర్కార్ సాధించిన ప్రగతి, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రజల అవసరాలు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది.. పలు అంశాలపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మొదట చర్చ సాగింది.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5…
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోన్న సమయంలో.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సూచనలతో ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌పై తాజా పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో..…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.. ప్రపంచాన్ని భయపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించనుంది కేబినెట్.. ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణ చర్యలపై ఫోకస్ పెట్టనున్నారు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు, టెస్టులు, ట్రేసింగ్.. క్వారంటైన్ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.. కరోనా టెస్టులు పెంచే అవకాశం ఉండగా… మాల్స్, థియేటర్లు, పబ్‌లపై నియంత్రణా చర్యలు చేపట్టే విధంగా ఓ నిర్ణయానికి రానున్నట్టుగా సమాచారం. ఇక, వ్యాక్సినేషన్…
తెలంగాణలో ప్రస్తుతం దళితబంధుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అర్హులైన పేద దళిత కుటుంబాలకు పది లక్షల ఆర్థిక సాయం ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దీని విధివిధానాలపై ఆయా వర్గాలతో చర్చలు జరిపారు. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఇవాళ జరిగే కేబినెట్ భేటీలోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు… ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత…
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మూడో విడత లాక్‌డౌన్ గడువు ఈ నెల 9తో ముగుస్తుంది. దీంతో తదుపరి కార్యాచరణ కోసం కేబినెట్ మరోసారి సమావేశమవుతోంది. లాక్ డౌన్ సడలింపుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న…