Telangana Bonalu: తెలంగాణ సంస్కృతిలో బోనాల స్థానం – 600 ఏళ్ల ప్రస్థానం
- తెలంగాణలో నేటి నుంచి ఆషాడ మాసం బోనాలు..
- ఈరోజు గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బోనం..
- తెలంగాణ సంస్కృతిలో బోనాల స్థానం – 600 ఏళ్ల ప్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Bonalu: తెలంగాణ సంస్కృతికి ప్రతీక, అత్యంత వైభవంగా నిర్వహించుకునే ఆషాడ మాస బోనాలు ఈరోజు (జూన్ 26) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బోనాలు జులై 24వ తేదీతో ముగుస్తాయి. ఇక, అమ్మల గన్న అమ్మ, ఆది పరాశక్తికి బోనం నైవేథ్యం సమర్పణను తెలంగాణలో ఓ పండుగలా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా పలు రకాల పూజలు చేస్తారు. . డిల్లెం పల్లెం చప్పుళ్లతో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో పాటు పసుపు బండారులు, వేపల సువాసనల నడుమ కల్లు సాకలతో ఆ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల ఊరేగింపు సమయంలో నువ్వు పెద్దపులి ఎక్కినావమ్మో అంటూ అందరూ కలిసి ఆడుతూ పాడుతూ చేసే ఆ వేడుకే తెలంగాణ బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణీయం. దశాబ్దాల చరిత్ర కలిగిన బోనాల జాతర తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైంది.
Read Also: Aashadam Bonalu 2025 : గోల్కొండపై తొలి బోనం.. ఆషాఢ బోనాలకు భక్తి శోభా ఆరంభం!
Also Read
అయితే, ఈరోజు ఆషాడ మాసం తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి భక్తులు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ అర్చకులు జగజ్జనని అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో బోనాల పండగ సందడి స్టార్ట్ అవుతుంది. ఇక, జులై 13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో బోనాలు తీయనున్నారు. వీటినే లష్కర్ బోనాలు అని పిలుస్తారు. జులై 21వ తేదీన లాల్‌దర్వాజ ఆలయంలో జరిగే రంగం వేడుకలతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి.
Read Also: Akhanda Godavari Project: నేడు ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్‌కు శంఖుస్థాపన!
ఇక, తెలంగాణలో బోనాల పండగ ఉత్సవాలకు ఎంతో చరిత్ర కలిగి ఉంది. 600 ఏళ్ల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు ఏడుకోళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలను సమర్పించుకున్నారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అలాగే, 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్ లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారని నానుడి. ఇక, గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే బోనాలు పండగ జరుగుతుందని.. ఆ తర్వాత గోల్కొండను జయించిన కులీ కుతుబ్ షా, బాదూషా సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని చరిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తానీషా పాలనలో అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలోనే ఘనంగా గోల్కొండ కోట మొదలు హైదరాబాద్‌లోని అమ్మవార్లు, గ్రామ దేవతల ఆలయాల్లో బోనాల పండగ సంబరాలు వైభవంగా సాగేవని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. కాగా, బోనాల ఉత్సవాలను కల్లారా చూసి ఆనందంతో పరవశిస్తుంటారు భక్తులు. ఈ జాతర నెల రోజులు తెలంగాణ పుర వీధులు కళకళలాడుతుంటాయి. రాష్ట్రంలోని ప్రతి గడప పచ్చని వేపాకులతో పసుపు గడపలతో ఇంటి ఆడపడులు, పిల్లా పాపలతో కళకళలాడుతు దర్శనమిస్తాయి.
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!