Telangana BJP Politics : తెలంగాణ బీజేపీలో ఇదో కొత్త పంచాయితీ. టీఆర్ఎస్ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకొన్న నేతల మధ్య అస్సలు పడటం లేదట. ఒక నేత తీరుపై గుర్రుగా ఉన్న కొందరు.. ప్రత్యేకంగా సమావేశం పెట్టుకునే వరకు సమస్య తీవ్రత చేరుకుంది. సీనియర్లుగా ఉన్నా ప్రాధాన్యం దక్కడం లేదని రుస రుసలాడుతున్నాట. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా? గడిచిన ఏడాదిన్నర కాలంగా తెలంగాణ బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన…
బాబూమోహన్. మాజీ మంత్రి. గతంలో ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ, టీఆర్ఎస్ల నుంచి గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టారు కూడా. గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిపోయారు. ఈ దఫా ఎలాగైనా గెలిచి తిరిగి పట్టు సాధించాలని చూస్తున్నారు బాబూమోహన్. నియోజకవర్గంపై పట్టు ఉండటంతో తప్పకుండా తనకే బీజేపీ సీటు ఇస్తుందని లెక్కలేసుకుంటున్నారు. అయితే ఆందోల్ బీజేపీలో పరిస్థితులు మరోలా ఉన్నాయట. అక్కడ జడ్పీ మాజీ ఛైర్మన్ బాలయ్య నుంచి గట్టి పోటీ ఉందట బాబూమోహన్కు. దీంతో…
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా.. నేడు నగరానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదికవుతోంది. పీఎం మోదీ.. అమిత్ షా.. జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులతో పాటు 360 మంది జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా.. రాజకీయ ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ సమావేశాలతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జూలై…
నల్లు ఇంద్రసేనారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. అప్పట్లో వేళ్లమీద లెక్కపెట్టే బీజేపీ నేతల్లో ఒకరు. గతంలో బీజేపీకి రాష్ట్ర చీఫ్గానూ పనిచేశారు ఇంద్రసేనారెడ్డి. ప్రస్తుతం బీజేపీలో ఇతర పార్టీల నాయకుల చేరికలకు సంబంధించిన కమిటీకి ఛైర్మన్గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డితోపాటు ఆ కమిటీలో ఏడుగురు పార్టీ నేతలు సభ్యులు. తెలంగాణలో బీజేపీలో ఎవరైనా చేరాలి అని అనుకుంటే ఈ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చేవారి వల్ల పార్టీకి ఏ మేరకు లాభం..…
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీలో వలస నేతలకు నిప్పులపై నిల్చున్నట్టు ఉందట. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ఈటల రాజేందర్తోపాటు హుజూరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్లోని పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకొన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత జిల్లా బీజేపీలో ప్రాధాన్యం దక్కుతుందని లెక్కలేసుకున్నారట. అప్పటికే పార్టీ పదవుల కోసం జిల్లాలో సీనియర్లు, జూనియర్లు అనే యుద్ధం జరుగుతోంది. ఈ పోరులో వలస నేతలు గుర్తింపు కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టు చెవులు…
తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందా? రాబోయే రోజుల్లో కమలదళం దూకుడు పెంచుతుందా? అంటే అవుననే అనిపిస్తోంది.2023 ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే స్కెచ్చేస్తోంది. మరో వైపు బీజేపీ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జూలైలో జరగబోతున్నాయి. దీనికి సబంధించి కమలదళం ఇప్పటినుంచి ఏర్పాట్లు మొదలుపెట్టింది. తెలంగాణపై బిజెపి కేంద్ర నాయకత్వం సీరియస్గా ఫోకస్ చేసింది. ఎలాగైనా కాషాయ జెండా ను ఎగిరే యాలని వ్యూహ రచన చేస్తున్నారు..…