బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు చేరుకొని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుల గణనకు మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సమగ్ర కుల గణన, రిజర్వేషన్ల పెంపుకు సహకరించి, మద్దతు తెలపాలని కిషన్ రెడ్డిని కలవడం జరిగిందని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్…