TS Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. బీఆర్‌ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.
EC Officers: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు వివిధ పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సంఘంలో పలువురు అధికారులను మార్చి కొత్త నియామకాలు చేపట్టారు.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతవరణం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార పార్టీ తమ వ్యూహాలకు పదునుపెట్టగా.. ప్రతిపక్షాలు తమదైన శైలిలోకి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని పావులు కదుపుతోంది.
కాంగ్రెస్ పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్‌కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అంటూ.. హైదరాబాద్ సోమాజిగూడలోని కత్రియా హోటల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు.