Tummala Nageswara Rao : అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, పేమెంట్ సక్రమంగా జరుగుతున్నాయని కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మిల్లులకు ధాన్యం కోసం లారీల ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సన్నరకం పండించిన రైతులకు బోనస్ గా 500 రూపాయలు ఇవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. గిట్టుబాటుధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో ఈ ప్రజా ప్రభుత్వం అన్ని పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసిందని, రాష్ట్రంలో 66లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారన్నారు.
IPL Auction 2025: వైభవ్ సూర్యవంశీని అందుకే తీసుకున్నాం: రాహుల్ ద్రవిడ్
ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందని, సరిహద్దు జిల్లాల్లో నుంచి బోనస్ కోసం ధాన్యం రాష్ట్రంలోకి వస్తుంది. ఆ ధాన్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఈనెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండగను జరుపబోతున్నామని, దానిని పురస్కరించుకొని 28, 29, 30 తేదీల్లో మహబూబ్ నగర్ లో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసామన్నారు. ఈనెల 30న జరిగే రైతు పండుగను కలెక్టర్లు అందరు సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పౌరసత్వం’’ రద్దు చేయాలని పిటిషన్..