Thummala: రాష్ట్రవ్యాప్తంగా కొత్తరకం పంటలను రైతులకు పరిచయం చేయాలని వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ పంటలను పండిచేందుకు వాళ్లను మానసికంగా సంసిద్ధం చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష నిర్వహించారు. సమావేశం సందర్భంగా మంత్రికి సెక్రటరీ రఘునందన్ రావు, హెచ్ఓడీ, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత తుమ్మల మొదటి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ.. నా వృత్తి వ్యవసాయం అన్నారు. నేనున్న వృత్తికి సంబంధిన పోర్ట్ ఫోలియో నే నాకు కేటాయించడం సంతోషకరమని తెలిపారు. ముఖ్యమంత్రి ముందు చూపునకు అది నిదర్శనం అన్నారు. వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించడం వల్లే ఆయన నాకు ఈ శాఖను కేటాయించారని తెలిపారు.
Read also: Virat Kohli-Anushka Sharma: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల బంధానికి ఆరేళ్లు!
అన్ని రకాల పంటలకు తెలంగాణా నేల అనుకూలంగా ఉంటుంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదన్నారు. సీజన్ల వారిగా ముందుగానే శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకు తగ్గట్టుగా రైతులను వ్యవసాయానికి సమాయత్తం చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఉత్పత్తి పెంచి వ్యవసాయశాఖకు మంచి పేరు తేవాలన్నారు. వ్యవస్థలో, శాఖాపరంగా ఉన్న లోపాలను సవరించుకొని రైతులకు సంక్షేమానికి అధికారగణం పాటుపడాలన్నారు. మంచి పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక పంట దిగుబడిని సాధించడమే కాకుండా, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం విశేషంగా కృషి చేయాలని తెలిపారు. తద్వారా రైతులకు మంచి మద్దతు ధర లభించేలా మార్కెటింగ్ శాఖా అధికారులు కృషి చేయాలని తెలిపారు.
Read also: Telangana Speaker Election: స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. 14న ఎన్నిక..
రాష్ట్రవ్యాప్తంగా కొత్తరకం పంటలను రైతులకు పరిచయం చేయాలి. వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, ఆ పంటలను పండిచేందుకు వాళ్లను మానసికంగా సంసిద్ధం చేయాలని అన్నారు. మామిడి, జామ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆ పంటల సాగుకు సహాయపడాలని తెలిపారు. పాం ఆయిల్ పంట సాగు చేసే రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారని అన్నారు. వాళ్లకు మంచి గిట్టుబాటు ధర లభిస్తోందని తెలిపారు. ఆ సాగును మరింత ప్రోత్సహించాలని, అందులో అంతర పంటగా పుచ్చకాయలు పండించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. రైతు బాగు పడితే మిగిలిన అన్ని రంగాలు బాగు పడతాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటందన్నారు. రైతు బాగుండాలి అనేది నా ఆశయమన్నారు.
Alla Ramakrishna Reddy: అందుకే ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా.. క్లారిటీ ఇచ్చిన ఆర్కే