2019 ఆగష్టులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రాష్ట్ర హోదాను రద్దుచేసి లడక్‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటి జాతీయ స్థాయి రాజకీయ చర్చ జరిగింది. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ ఒమర్ అబ్దుల్లాలు, గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తిలతో పాటు బిజెపి నేత రవీంద్రరైనా నిర్మల్ సింగ్, సిపిఎం నాయకుడు ఎంఎల్‌ఎ యూసప్ తరగామి, ఆప్…
సినిమా పరిశ్రమ దానికదే ఒక ప్రత్యేక ప్రపంచమైనా ప్రచారం ప్రభావం ఆకర్షణ చాలా ఎక్కువగా వుంటాయి. నటుల రాజకీయ ప్రవేశం ప్రభుత్వాల ఏర్పాటు అనుకూల వ్యతిరేక రాజకీయాల కారణంగా ఇది మరింత పెరుగుతుంటుంది. తెలుగు సినిమా నటీనటుల సంఘం మా ఎన్నికలు అందుకే గత రెండు మూడు పర్యాయాలుగా చాలా ఆసక్తి పెంచుతున్నాయి. పోటీలో వున్న అభ్యర్థులు ఎవరన్నది ఒకటైతే వారిని బలపర్చేవారెవరూ ఎవరి బలం ఎంత వంటి ప్రశ్నలు ముందుకు తెస్తున్నాయి. ఈసారి ప్రకాశ్ రాజ్…
ఎన్‌సిపి నేత శరద్‌పవార్ నివాసంలో మంగళవారం ప్రతిపక్ష నాయకుల సమావేశం గురించిన కథనాలన్నీ చాలా త్వరగా తేలిపోయాయి. ఏ సమావేశమైనా సరే దాని నిర్వాహకులెవరు, ఉద్దేశమేమిటనేదానిపై ఆధారపడి వుంటుంది. కాని ఈ సమావేశం విషయంలో ప్రతిదీ భిన్న కథనాలతో నడిచింది. శరద్ పవార్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండు సార్లు కలుసుకొని చర్చలు జరపడం దీనికి తొలి సంకేతమైంది. తర్వాత రాష్ట్రీయ మంచ్ నాయకుడుగా బయిలుదేరి ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఉపాద్యక్షులుగా వున్న మాజీ బిజెపి…
కోవిడ్ 19 మలిదశ తీవ్రతతో ప్రధానిమోడీ బ్రాండ్ తగ్గిన బిజెపి కాయకల్ప చికిత్సల కోసం అవస్థ పడుతుంటే ఇతర పార్టీల పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. ఒక అనిశ్చితి అంతటా ఆవరించింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూడా ఎంతకూ కోలుకోలేకపోతున్నది. ఆ పార్టీ ముఖ్యనాయకులైన జితిన్ ప్రసాద్ వంటివారు బిజెపిలో చేరడం,రాజస్థాన్‌లో సచిన్‌పైలెట్ కేంద్రంగా అసమ్మతి పునరావృతం కావడం, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌పై నవజ్యోతి సిద్దు తదితరుల తిరుగుబాటు వంటివి ఎడతెగని సమస్యలుగా మారాయి.జితిన్ ప్రసాద్ నిష్క్రమణ…
తాము పూర్తిగా ఏకీభవించని వారినెవరినైనా ఇతరులు గౌరవిస్తున్నారంటే అది వారి వ్యక్తిత్వానికి ప్రతీక. ప్రొఫెసర్ జయ శంకర్ అక్షరాలా అలాంటి వ్యక్తి. అరవై ఏళ్లపాటు ఒకే మాటకు బాటకు కట్టుబడి నిస్వార్థంగా నిష్కల్మషంగా నిలబడ్డారు. తెలంగాణా విముక్తికి మొదటి తరంలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి వారు ప్రతీకలైతే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు తర్వాత కాలంలో ఆ ప్రాంత సమస్యలకు ఆయన ప్రతిధ్వని అయ్యారు. అది పదవులతో ప్రచారాలతో సంబంధం లేని భావాత్మక ప్రాతినిధ్యం. అనుకున్నది…
ఒకవైపున మలివిడత కరోనా మరణాల తాకిడి తగ్గిందని వార్తలు మరోవైపు మూడో విడతపై భయసందేహాల మధ్య కేంద్రం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక పరస్థితులు ప్రజల జీవనగతులు తలకిందులైనాయి. ధరల పెరుగుదలకు తోడు ప్రభుత్వాల ఉపేక్ష ప్రజల పాలిట పెనుశాపంగా మారింది. మరోవైపున ఈ దెబ్బతో రాజకీయ వ్యవస్థ కూడా కల్లోలితమవుతున్నది. నిరంతర ప్రవచనాలతో ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే ప్రధాని నరేంద్ర మోడీ ప్రాదరణ తగ్గినట్టు ఎప్పటికప్పుడు సర్వేలు ఎన్నికలు కూడా విదితం…
మాన్సాస్ ట్రస్టుకూ, సింహాచలం దేవస్థానానికి చైర్మన్‌గా టిడిపి మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచైతను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిని మళ్లీ నియమించాలని ఆదేశించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు తమకింకా అందలేదని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. మరోవైపున తెలుగుదేశం నాయకులు ఇది ప్రజాస్వామ్య విజయమనీ, ప్రభుత్వానికి చెంపపెట్టు అని…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్‌ఎస్‌కూ, శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో చేరతారని వార్తలు వచ్చినా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఈ చేరికకు ఆధ్వర్యం వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బిజెపి ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ తదితరులతో కలసి తర్వాత నడ్డాను కలిసి ఆ లోటు భర్తీ చేసుకోవలసి వచ్చింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీ…
సాహిత్యస్పూర్తి, సమయస్పూర్తి, సభాస్పూర్తి, స్నేహ స్ఫూర్తి కలబోసుకున్న స్పురద్రూపి సినారె. రాతకూ కూతకూ పాటకూ మాటకూ కలానికి గళానికి సరిహద్దులు చెరిపేసిన వారు. ‘నిలకడగా వున్న నీళ్లలో కమలాలే కాదు, క్రిములూ పుడతాయి’ అని రాసిన సి.నారాయణరెడ్డి నిజంగానే చలనశీలంగా బతికారు, కొన్నేళ్ల కిందట త్యాగరాయ గానసభ వేదికపై ఆ చరణాలు చెప్పి తన కవిత్వం ప్రవాహ గుణ ప్రధానమని వర్ణిస్తే నన్ను మెచ్చుకున్న సినారె సభలో పాల్గనని రోజు వుండేది కాదు. ఇంత సభా సంచారంలోనూ…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ఈ పర్యటనలో కేంద్రంలో కీలకనేత హోం మంత్రి అమిత్ షాతో సహా అయిదుగురిని కలుసుకున్నారు.రైల్వే మంత్రి పీయుష్‌గోయెల్,నీటి పారుదల మంత్రి గజేంద్ర షెకావత్,పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్,ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో పాటు నీటి ఆయోగ్‌వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్‌ను కూడా కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారని అధికారిక సమాచారం. అయితే మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ ఈ పర్యటనకు…