వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన వైఎస్‌ఆర్‌సిపి ఇంకా ప్రభావశీలంగా మారవలసే వుంది.విస్త్రత కార్యాచరణ చేపట్టవలసే వుంది.అయితే ఆమె వైఎస్‌రాజశేఖర రెడ్డి కుమార్తె కావడం, అంతకు మించి ఆమె అన్న జగన్మోహనరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వుండటం వల్ల కావలసినంత ప్రచారం లబించడం సహజమే.అందుకు తోడు మీడియాలో ఒక భాగం ఆమె పార్టీ స్థాపనకు ముందునుంచే అమితంగా కథనాలు వదలడం, జగన్‌పై కోపంతోనే ఈ పార్టీ స్థాపిస్తున్నారని జోస్యాలు చెప్పడం ఆసక్తి పెంచింది.తెలంగాణలో పార్టీ పెట్టి ఎపి ముఖ్యమంత్రిపై…
వలసపాలన అవశేషమైన 124(ఎ) సెక్షన్ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనవార్తగా ప్రచారమవుతున్నది. ఇటీవలి కాలంలో చాలాసార్లు ఈ తరహాలోనే సుప్రీం దర్మాసనాలు వ్యాఖ్యానాలు చేసినా నిర్ణయాత్మకంగా కొనసాగింపు లేదు.వార్తలు వ్యాఖ్యల ద్వారా తమ వృత్తిధర్మం నిర్వహించే పాత్రికేయులకు రక్షణ వుండాలని సీనియర్ జర్నలిస్టు వినోద్‌దువా కేసులో ఇటీవలే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చింది. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. మీడియా ప్రసారాలు ప్రచురణలపై…
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గాన్నిభారీ ఎత్తున విస్తరించినపుడు అందరికీ అర్థమైంది 2022 ఎన్నికల కోణం. 2022 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకూ బిజెపికి ముఖ్యమైన చాలా రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో విజయం సాధించకపోతే 2024 లోక్‌సభ ఎన్నికలలో తిరిగి అధికారంలోకి రావడం కూడా కష్టతరమే అవుతుంది. కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం, మరణాలు మోడీ సర్కారుపై విమర్శలు పరాకాష్టకు చేర్చడమే గాక ఈ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ వారి విజయావకాశాలను చాలా…
కృష్ణానదీ జలాలపై ఎపి తెలంగాణ మధ్య ముదిరిన వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు లేవు.మేమంటే మేమే సరైన విధానంతో వున్నామని ఉభయ రాష్ట్రాలూ గట్టిగా వాదిస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత వ్యవస్థలకు ఫిర్యాదులు చేస్తున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాగూ ఇలాటి వివాదాలను వెంటనే పరిష్కరించేతొందరలోలేదుగనక నీళ్లునిప్పులై మండటం అనివార్యం. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అనే ఆరోపణలుచేసేవారే మళ్లీ అవతలివారిని గట్టిగా ఖండిరచలేదని తప్పుపడుతున్నారు. మొత్తంపైన ఈవివాదంలో రాజకీయాలు వున్నా నీటికి సంబం ధించినపూర్తి భిన్నాభిప్రాయాలు అవాస్తవం కాదు.…
చైనా కమ్యూనిస్టుపార్టీ శతవార్షికోత్సవ వేడుకలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈనాటి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాన్ని ఒక పార్టీ వందేళ్లపాటు నడిపించడం, సోవియట్ యూనియన్ విచ్చిన్నమైన తర్వాత కూడా సోషలిస్టు విధానం తమదంటూ కమ్యూనిస్టుల నాయకత్వంలో అమెరికాకు దీటుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థితిలో వుండటం చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రత్యేకత. ఆసియాలో అత్యంత ప్రాచీన చరిత్ర, నాగరికతగల దేశం చైనా. అసమర్ధ చక్రవర్తుల పాలనలో విదేశీ శక్తులు తిష్టవేశాయి. అది స్థానిక యుద్ధ ప్రభావాల ఘర్షణలకు రంగస్థలమైంది.…
2019 ఆగష్టులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రాష్ట్ర హోదాను రద్దుచేసి లడక్‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటి జాతీయ స్థాయి రాజకీయ చర్చ జరిగింది. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ ఒమర్ అబ్దుల్లాలు, గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తిలతో పాటు బిజెపి నేత రవీంద్రరైనా నిర్మల్ సింగ్, సిపిఎం నాయకుడు ఎంఎల్‌ఎ యూసప్ తరగామి, ఆప్…
సినిమా పరిశ్రమ దానికదే ఒక ప్రత్యేక ప్రపంచమైనా ప్రచారం ప్రభావం ఆకర్షణ చాలా ఎక్కువగా వుంటాయి. నటుల రాజకీయ ప్రవేశం ప్రభుత్వాల ఏర్పాటు అనుకూల వ్యతిరేక రాజకీయాల కారణంగా ఇది మరింత పెరుగుతుంటుంది. తెలుగు సినిమా నటీనటుల సంఘం మా ఎన్నికలు అందుకే గత రెండు మూడు పర్యాయాలుగా చాలా ఆసక్తి పెంచుతున్నాయి. పోటీలో వున్న అభ్యర్థులు ఎవరన్నది ఒకటైతే వారిని బలపర్చేవారెవరూ ఎవరి బలం ఎంత వంటి ప్రశ్నలు ముందుకు తెస్తున్నాయి. ఈసారి ప్రకాశ్ రాజ్…
ఎన్‌సిపి నేత శరద్‌పవార్ నివాసంలో మంగళవారం ప్రతిపక్ష నాయకుల సమావేశం గురించిన కథనాలన్నీ చాలా త్వరగా తేలిపోయాయి. ఏ సమావేశమైనా సరే దాని నిర్వాహకులెవరు, ఉద్దేశమేమిటనేదానిపై ఆధారపడి వుంటుంది. కాని ఈ సమావేశం విషయంలో ప్రతిదీ భిన్న కథనాలతో నడిచింది. శరద్ పవార్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండు సార్లు కలుసుకొని చర్చలు జరపడం దీనికి తొలి సంకేతమైంది. తర్వాత రాష్ట్రీయ మంచ్ నాయకుడుగా బయిలుదేరి ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఉపాద్యక్షులుగా వున్న మాజీ బిజెపి…
ఒకవైపున మలివిడత కరోనా మరణాల తాకిడి తగ్గిందని వార్తలు మరోవైపు మూడో విడతపై భయసందేహాల మధ్య కేంద్రం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక పరస్థితులు ప్రజల జీవనగతులు తలకిందులైనాయి. ధరల పెరుగుదలకు తోడు ప్రభుత్వాల ఉపేక్ష ప్రజల పాలిట పెనుశాపంగా మారింది. మరోవైపున ఈ దెబ్బతో రాజకీయ వ్యవస్థ కూడా కల్లోలితమవుతున్నది. నిరంతర ప్రవచనాలతో ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే ప్రధాని నరేంద్ర మోడీ ప్రాదరణ తగ్గినట్టు ఎప్పటికప్పుడు సర్వేలు ఎన్నికలు కూడా విదితం…
ఇటీవల ఎపి ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు ఢల్లీిలో పర్యటించి కేంద్ర పెద్దలను కలసి వచ్చాక పాలనావికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల హడావుడి బాగా పెరిగింది. హోంమంత్రిఅమిత్‌షాను కలుసుకున్నప్పుడు ఇచ్చిన మెమోరాండంలో మొదటి అంశమే పాలనావికేంద్రీకరణ కావడం యాదృచ్చికం కాదు..దీనిపై ఢల్లీిపెద్దలు ఏ రూపంలోనూ ఎలాటి అభ్యంతరంగాని భిన్నాభిప్రాయం గాని వెలిబుచ్చలేదు సరికదా ముందుకు పొమ్మని పచ్చజెండా వూపినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుతో మొదలు పెట్టి వివిధ విభాగాలకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు…